మాస్ కు మించి ఎమోషన్.. ది ప్యారడైజ్ పై నాని కామెంట్స్
నేచురల్ స్టార్ నాని(nani) నటిస్తున్న ది ప్యారడైజ్(the paradise) పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్(Anirudh ravichander) మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని బెంగళూరులో మీడియాతో ముచ్చటించారు. సాధారణ మాస్ సినిమాలకు భిన్నంగా ది ప్యారడైజ్ లో ఎమోషన్‌కు పెద్దపీట వేశామని ఆయన చెప్పడం ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాలో తల్లి, కొడుకు మధ్య ఉండే స్ట్రాంగ్ బాండింగే కథకు కీలకంగా నిలుస్తుందని నాని వెల్లడించారు. భారీ యాక్షన్, విజువల్స్ మాత్రమే కాకుండా నటీనటుల పెర్ఫార్మెన్స్కు కూడా సినిమాలో విస్తృతమైన అవకాశం ఉందన్నారు. తనతో గతంలో దసరా మూవీలో కలిసి పనిచేసిన దీక్షిత్ శెట్టి(deekshith Shetty) కన్నడ వెర్షన్‌కు తన పాత్రకు డబ్బింగ్ చెప్పినట్లు తెలిపారు. ఆయన వాయిస్ సినిమాకు పర్ఫెక్ట్గా సరిపోతుందని నాని పేర్కొన్నారు.
ఇక అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని నాని చెప్పారు. ముఖ్యంగా యేషనాగుల కట్ట మీద(Yashanagula kattamidha) సాంగ్ ఇప్పటికే ఆడియన్స్ లో మంచి జోష్ ను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా నాని యాంకర్‌తో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేయడం కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. మోహన్ బాబు(mohan babu), సోనాలి కులకర్ణి(Sonali kulakani), రాఘవ్ జుయాల్(Raghav juyal), కాయదు లోహర్(Kayadhu lohar) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై రిలీజ్ కు ముందే ఆసక్తి నెలకొంది.








