భారీ రేటుకు విశ్వంభర ఓటీటీ హక్కులు
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) నటించిన విశ్వంభర(Vishwambhara) రిలీజ్ కు సంబంధించి కీలకమైన అడుగు పడినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్(UV Creations) నిర్మించిన ఈ సినిమాను అమెజాన్ సంస్థ రూ.55 కోట్లకు ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఈ డీల్ వెనుక సంక్రాంతి రిలీజ్ అంశం కూడా కీలకంగా మారిందని ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. 2027 సంక్రాంతి సీజన్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే హామీతోనే డీల్ కుదిరిందనే టాక్ వినిపిస్తోంది. దీంతో రిలీజ్ విషయంలో మేకర్స్‌పై ఇప్పుడు మరింత ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో సంక్రాంతి రేసులో ఉన్న కాకా(kaaka) పరిస్థితి కూడా ఆసక్తికరంగా మారింది. బాబీ(bobby) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. దాదాపు 50 రోజుల షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ అక్టోబర్, నవంబర్‌లో షూటింగ్ ను ముగించి, డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అంటే సంక్రాంతి రిలీజ్ కు అవసరమైన టైమ్ అందుబాటులోనే ఉందని తెలుస్తోంది.
అసలు చిక్కు మాత్రం కాకా మూవీ ఓటీటీ డీల్‌తోనే ముడిపడి ఉంది. డిజిటల్ పార్టనర్ సంక్రాంతి రిలీజ్ కు ఎలాంటి కండిషన్స్ పెడుతుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ రెండు సినిమాలకూ ఒకేసారి రిలీజ్ పై ఎలాంటి అభ్యంతరం లేకపోతే చిరంజీవి విశ్వంభర, కాకా బాక్సాఫీస్ వద్ద నేరుగా తలపడే అవకాశం ఉంది. లేదంటే ఈ రెండింటిలో ఏదో ఒక సినిమా తన రిలీజ్ ప్లాన్‌ను మార్చుకోవాల్సి రావచ్చు. దీంతో సంక్రాంతి రేసు ఇప్పుడు ఓటీటీ నిర్ణయాలపై కూడా ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది.








