గణేశ పండుగలో శోభారాజు శిష్య గానం
కొండాపూర్లోని హాపీజ్ నగర్ వసంత్ సిటీ లో గణపతి పండుగ మూడవ రోజు సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని శిష్య బృందం సాందీప్, శ్రేయ, సాయి గాయత్రి, తేజస్విని, రన్విత రెడ్డి, అక్షయ, అక్షయ్ సంయుక్తంగా గణపతి మరియు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఇందులో భాగంగా అన్నమ గాయత్రి, గణరాజ గుణరాజ, కొండలలో నెలకొన్న, సకల శాంతి, సామజవర వదన, గుజ్జు రూపమున, నమో నమో గణనాధ, గోవిందాశ్రిత, గణపతి నీవే గతి, సిరుత నవ్వుల వాడే, అదివో అల్లదిహో, చిత్తము కొలది, వద్దే గొల్లెత, వేడుకుందామా, తందనాన అహి అనే కీర్తనలతో అలరించారు. తబలా పై సిద్ధు, కీ బోర్డ్ మీద మనోహర్ వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం శ్రీ రమణ గోరంట్ల సారథ్యం వహించారు. భక్తులు ఈ భక్తి పూర్వక కీర్తన మరియు భజనలో ఉత్తేజంగా పాల్గొని ఆనందం పొందారు.








