శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26న సంగీత, నృత్య వినోద కార్యక్రమం..
శంకర నేత్రాలయ యూఎస్ఏ (Sankara Nethralaya USA) సంస్థ ఆధ్వర్యంలో అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరంలో అత్యంత వైభవంగా ‘మ్యూజిక్ అండ్ డాన్స్ ఎంటర్టైన్మెంట్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. శంకర నేత్రాలయ ఫౌండర్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్.ఎస్.బద్రీనాథ్, ప్రెసిడెంట్ ఎమెరిటస్ ఎస్.వి.ఆచార్య మార్గదర్శకత్వంలో ఈ సేవా కార్యక్రమం జరగనుంది.
కార్యక్రమ వివరాలు…
తేదీ, సమయం: సెప్టెంబర్ 26, 2026, శనివారం సాయంత్రం 5:00 గంటలకు(CST) ఈ వేడుక ప్రారంభమవుతుంది.
వేదిక: సెప్టెంబర్ 26వ తేదీన టెక్సాస్లోని రౌండ్ రాక్, గ్రేట్ ఓక్స్ డ్రైవ్లో ఉన్న ‘సెంట్ ఫిలిప్స్ యునైటెడ్ మెథడిస్ట్ చర్చి’ (St. Philip’s United Methodist Church)లో ఈ కార్యక్రమం జరగనుంది.
ప్రముఖ గాయకులు రాము (Ramu), అంజనా సౌమ్య (Anjana Soumya) తమ మధురమైన పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
ఆస్టిన్ టీమ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ:
ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో శంకర నేత్రాలయ యూఎస్ఏ ఆస్టిన్ చాప్టర్ టీమ్, బోర్డ్ ఆఫ్ ట్రైనీస్ సభ్యులు డాక్టర్ జగన్నాథ్ వేదుల, కరుణ్ రెడ్డి, మల్లికార్జునరావు చింతకుంట, జగదీశ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే బోర్డ్ ఆఫ్ ట్రైనీస్ సభ్యులు డాక్టర్ రెడ్డి ఉరిమిండి, బుచ్చిరెడ్డి గోలి, నారాయణ్ రెడ్డి ఇందూరి, చినసత్యం వీర్నాపు, వీరేందర్ దేవిరెడ్డి, వంశీ తదితరులు ఈ వేడుక నిర్వహణలో భాగస్వామ్యం కానున్నారు.
విరాళాల సేకరణ…
ఈ సంస్థ చేపడుతున్న నేత్ర వైద్య సేవల కోసం సింగిల్ కటరాక్ట్ సర్జరీకి 65 డాలర్లు, మేజర్ సర్జరీకి 250 డాలర్లు, వన్ డే మొబైల్ రూరల్ టెలి ఆప్తాల్మాలజీ క్యాంపునకు 290 డాలర్లుగా విరాళాలు సేకరిస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కంటి స్క్రీనింగ్ క్యాంపులు, వార్షిక కటరాక్ట్ సర్జరీలు, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు వంటి వివిధ పథకాల ద్వారా విరాళాలు స్వీకరిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని, విరాళాలు అందించాలనుకునే వారు పోస్టర్ పై ఉన్న క్యూఆర్ కోడ్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా తమ సహకారాన్ని అందించవచ్చు.
Donation Link – https://sankaranethralayausa.org/donation-page.html
Adopt a Village – https://www.sankaranethralayausa.org/pdf/adopt-a-village-faq-flyer-15072026.pdf








