మేరీలాండ్ లో తానా బ్యాక్ ప్యాక్ కార్యక్రమం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) క్యాపిటల్ ఏరియా టీమ్ ఆధ్వర్యంలో గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా, మేరీల్యాండ్‌లోని విండ్సర్ మిల్లో ఉన్న ‘ది ఎక్స్ఛేంజరీ’ – ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ బాల్టిమోర్ కౌంటీ పబ్లిక్ స్కూల్స్‌కు స్కూల్ బ్యాగ్‌లు మరియు ఇతర వస్తువులను విరాళంగా అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి, తమ పూర్తి మద్దతును అందించిన తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలికి తానా క్యాపిటల్ టీమ్ ధన్యవాదాలను తెలియజేసింది. అలాగే, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమ వంతు సహాయం, విరాళాలు మరియు ప్రోత్సాహాన్ని అందించిన తానా బోర్డ్ డైరెక్టర్ అనిల్ ఉప్పలపాటికి, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేనికి, మరియు తానా బాల్టిమోర్ సిటీ కోఆర్డినేటర్ ఉమాకాంత్ తోపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ తానా రీజినల్ రిప్రజెంటేటివ్ సుధీర్ కొమ్మి ధన్యవాదాలు తెలియజేశారు.











