మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి అధికారులు ఫోన్ (Phone) ద్వారా ఆయనకు సమాచారం ఇచ్చారు. విచారణకు రావాలని ఈ నెల 11నే నోటీసులు (Notices) ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విచారణకు తమ కార్యాలయానికి రావాలని సమాచారం ఇచ్చారు. నోటీసులు ఏ కేసులో ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తనకు తెలియదని అంబటి రాంబాబు తెలిపారు.








