గుంటూరు పార్లమెంట్ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం
గుంటూరు జిల్లా టీడీపీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు భేటీ
హాజరైన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
గుంటూరు: గుంటూరు సాయిబాబా రోడ్డు, వినాయక నగర్ లో శుక్రవారం సాయంత్రం గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ విందు భేటీకి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. వైసీపీ అరాచక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు.
ఈ సమావేశంలో గుంటూరు ఎంపీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నసీర్, పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, గుంటూరు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.








