చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం .. పలు ప్రాజెక్టులకు ఆమోదం
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషితో పెద్దఎత్తున రాష్ట్రానికి తరలివస్తున్న ఐటీ కంపెనీలు
నేడు జరిగిన ఎస్ఐపీబీ (SIPB) భేటీలో రూ.526.25 కోట్ల పెట్టుబడులతో 8,896 ఉద్యోగాలు కల్పించే 10 ఐటీ ప్రాజెక్ట్ లకు ఆమోదం!
విశాఖపట్నంలో భారీగా ఐటీ, ఉపాధి అవకాశాలు – దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్
విశాఖలో 2,500 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటుకు రూ.43.75 కోట్ల పెట్టుబడితో డెలాయిట్ ప్రణాళికకు ఆమోదం!
వైజాగ్ వేదికగా ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆపరేషన్స్ కోసం 2,400 సీట్లతో రూ.100 కోట్ల పెట్టుబడితో ముత్తూట్ ఫిన్‌కార్ప్ ప్రతిపాదనకు ఆమోదం!
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం సచివాలయంలో జరిగింది. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ మరియు కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున దిగ్గజ ఐటీ మరియు ఫ్యూచర్ టెక్నాలజీ కంపెనీలు తరలివస్తున్నాయి. నేడు జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో రాష్ట్రంలో ఐటీ మరియు క్వాంటం రంగాన్ని మరింత విస్తరించడమే లక్ష్యంగా కీలక ప్రాజెక్టులకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో, ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి మరియు కడప జిల్లాల్లో భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ముత్తూట్ ఫిన్‌కార్ప్ (Muthoot Fincorp Limited – MFL): విశాఖపట్నంలో రూ.100 కోట్ల పెట్టుబడితో “ఇంటిగ్రేటెడ్ హబ్ ఏఐ & టెక్ ట్రైనింగ్ సెంటర్” ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీనిద్వారా 2,400 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ (AIL Dixon Technologies Pvt Ltd): కడప జిల్లాలో రూ.70 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకానున్న యూనిట్‌కు సంబంధించి ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2021-24 కింద అర్హమైన ప్రోత్సాహకాల దరఖాస్తు గడువు పొడిగింపునకు ఆమోదం లభించింది. 300 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
క్వాంటం రంగానికి అమరావతి కేంద్రం
సృష్టి క్వాంటం ప్రైవేట్ లిమిటెడ్ (Srsti Quantum Pvt Ltd) అమరావతిలో రూ.2,700 కోట్ల భారీ పెట్టుబడితో క్వాంటం కంప్యూటింగ్ హార్డ్‌వేర్, నానోఫ్యాబ్రికేషన్ రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీని ద్వారా దాదాపు 3,000 ఉద్యోగాలు సృష్టించబడతాయి. క్వాంటం కోడాన్ ప్రైవేట్ లిమిటెడ్ (Quantum Codon Pvt Ltd) అమరావతిలో రూ.167 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ క్వాంటం ఏఐ-డ్రైవెన్ బయోటెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాంపస్ (డ్రగ్ డిస్కవరీ రీసెర్చ్ కోసం) ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీని ద్వారా 126 మందికి ఉద్యోగాలు రానున్నాయి. అరోహాక్ టెక్నాలజీస్ (Arohak Technologies Pvt Ltd) అమరావతిలో రూ.62 కోట్ల పెట్టుబడితో ఫోటోనిక్స్ క్వాంటం రీసెర్చ్ & ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. తద్వారా 300 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ట్రైక్వాంటా లాబ్స్ (TriQuanta Labs Pvt Ltd) అమరావతిలో రూ.35 కోట్ల పెట్టుబడితో క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ మరియు ఇండియా యొక్క మొట్టమొదటి హైబ్రిడ్ క్వాంటం కంప్యూటింగ్ హార్డ్‌వేర్ తయారీ చేయనుంది. దీని ద్వారా 175 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఫోటాన్‌కోర్ సిస్టమ్స్ (Photoncore Systems Pvt Ltd) అమరావతిలో రూ.9 కోట్ల పెట్టుబడితో ‘PhotonQ’ రూమ్-టెంపరేచర్ ఫోటోనిక్ క్వాంటం కంప్యూటింగ్ సిస్టమ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది, 45 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వెరిడేటా హెల్త్ (Veridata Health Inc.) అమరావతిలో రూ.4.5 కోట్ల పెట్టుబడితో ప్రపంచపు మొట్టమొదటి రెగ్యులేటరీ-గ్రేడ్, క్వాంటం ఎనేబుల్డ్ క్లినికల్ ఆపరేటింగ్ సిస్టమ్ గ్లోబల్ ఇంజనీరింగ్ హబ్ ఏర్పాటు ఏర్పాటు చేసి 50 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వనుంది. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా రాష్ట్ర యువతకు అత్యాధునిక రంగాలలో ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ మరియు క్వాంటం రంగంలో గ్లోబల్ హబ్‌గా మారబోతుంది.








