నాని, శ్రీకాంత్‌ను శాటిస్ఫై చేసిన అనిరుధ్
నాని(nani), శ్రీకాంత్ ఓదెల(srikanth odela) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్(the paradise)పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఇప్పుడు సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో మెయిన్ ఎట్రాక్షన్ గా మారుతోంది. చెన్నైలో జరుగుతున్న రీరికార్డింగ్ వర్క్స్ క్లైమాక్స్ దశకు చేరుకోవడంతో చిత్రబృందం ఫైనల్ అవుట్‌పుట్‌పై పూర్తి దృష్టి పెట్టింది.
చెన్నైలో జరిగిన ప్రెస్‌మీట్ అనంతరం నాని, శ్రీకాంత్ ఓదెల కలిసి అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) స్టూడియోకు వెళ్లి సినిమా ఫస్ట్ హాఫ్‌ను వీక్షించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ అవుట్‌పుట్ చూసిన ముగ్గురూ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా నాని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్కు అనిరుధ్ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేషన్ తీసుకొస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే సాంగ్స్ తో మ్యూజికల్‌గా బజ్ క్రియేట్ చేసిన ది ప్యారడైజ్.. ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తోనూ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. రెండో భాగానికి సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్స్ కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 23న ప్రీమియర్ షోలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను వేగంగా పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. మొత్తంగా రిలీజ్ కు ముందు సినిమా టెక్నికల్ క్వాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు స్పష్టమవుతోంది.








