ది ప్యారడైజ్ కోసం నాని రెమ్యూనరేషన్ ఎంతంటే?
నాని(nani) కెరీర్లో ది ప్యారడైజ్(the paradise) కు ఓ ప్రత్యేకత ఉంది. సినిమా నిర్మాణం ఆలస్యం కావడంతో బడ్జెట్ అంచనాలు కూడా భారీగా మారాయి. ఈ నేపథ్యంలో హీరో రెమ్యునరేషన్ విషయంలో తీసుకున్న డెసిషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. సినిమా మొదట్లో నాని రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో కొంత వాటా తీసుకోవాలని భావించినట్లు సమాచారం.
అయితే బడ్జెట్ పెరగడంతో నాని ప్రస్తుతం రూ.20 కోట్ల రెమ్యూనరేషన్‌కే పరిమితమైనట్లు తెలుస్తోంది. మిగిలిన మొత్తాన్ని వెంటనే తీసుకోకుండా, నిర్మాత సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri) పెట్టుబడి పూర్తిగా రికవర్ అయిన తర్వాత తన బ్యాలెన్స్ రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా తీసుకునేలా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంటే సినిమా రిజల్ట్ తో నాని ఆదాయం కూడా ముడిపడి ఉందన్నమాట.
ఇప్పుడు అసలు టెస్ట్ థియేట్రికల్ బిజినెస్‌పైనే ఉంది. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా పెట్టుబడిని రాబట్టాలంటే బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. నాని, శ్రీకాంత్ ఓదెల(Srikanth odela) కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు ఈ విషయంలో కీలకంగా మారనున్నాయి. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ది ప్యారడైజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.








