ఎన్టీఆర్ రాకపై క్లారిటీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటిస్తున్న డ్రాగన్(Dragon) సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రశాంత్ నీల్(prasanth neel) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ విషయంలో టీమ్ ముందుగానే పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు సంబంధించిన సీన్స్ లేకుండా ఇతర నటీనటులతో కీలకమైన భాగాలను పూర్తి చేసే పనిలో డైరెక్టర్ ఉన్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో కొంతకాలంగా షూటింగ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సర్జరీ తర్వాత డాక్టర్ల సూచన మేరకు రెస్ట్ తీసుకుంటున్న ఆయన, అక్టోబర్ ఫస్ట్ వీక్ లో తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు టాక్. ఆయన రాకతో మిగిలిన కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే ప్రస్తుతం వచ్చిన బ్రేక్‌ను షూటింగ్ ఆగిపోయిన టైమ్ గా కాకుండా, ఇతర వర్క్స్ ను ముందుకు తీసుకెళ్లే అవకాశంగా టీమ్ ఉపయోగించుకుంటోంది.
మరోవైపు డ్రాగన్ రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. 2027 జూన్‌లోనే సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నారట. రుక్మిణి వసంత్(Rukmini vasanth) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers), ఎన్టీఆర్ ఆర్ట్స్(NTR Arts) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.








