ఇంటర్నేషనల్ ఆడియన్స్ కోసం రామాయణలో భారీ మార్పులు
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రామాయణ(Ramayana) ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని మరో కీలక అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. రణ్‌బీర్ కపూర్(Ranabir kapoor), సాయి పల్లవి(Sai pallavi), యష్(Yash) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ రెండు భాగాల సినిమాకు ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ల కోసం వేర్వేరు ఎడిట్స్ రెడీ చేస్తున్నారనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ఆడియన్స్ కోసం రూపొందించే ఇంగ్లీష్ వెర్షన్ హిందీ కట్ కంటే దాదాపు 30 నిమిషాలు తక్కువగా ఉండనున్నట్లు సమాచారం.
ఇండియన్ వెర్షన్లో సాంగ్స్, విస్తృతమైన సన్నివేశాలు కొనసాగనుండగా.. ఇంటర్నేషనల్ ఎడిషన్ లో సాంగ్స్ ను పూర్తిగా తొలగించి, కొన్ని సీన్స్ ను కుదించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇండియన్ సినిమాల లాంగ్ రన్‌టైమ్, సాంగ్స్ తో కూడిన కథనానికి ఆడియన్స్ అలవాటు పడినప్పటికీ, విదేశీ మార్కెట్లలో మరింత కాంపాక్ట్ నేరేషన్‌కు ప్రాధాన్యత ఉండటమే ఈ డెసిషన్ కు రీజన్ గా చెబుతున్నారు. దీంతో కథలోని మెయిన్ ఎమోషన్స్, విజువల్ ఎక్స్‌పీరియన్స్‌పై ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంది.
నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనున్నారు. రవి దూబే(Ravi dube) లక్ష్మణుడిగా, సన్నీ డియోల్(Sunny Deol) హనుమంతుడిగా నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రా(Namit Malhotra) నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్(Soni pictures) ఇంటర్నేషనల్ లెవెల్ లో రిలీజ్ చేయనుంది. తొలి భాగం 2026 నవంబర్‌లో, రెండో భాగం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.








