అధికార దాహంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు : కిషన్ రెడ్డి
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్ పార్టీలకు చెంపపెట్టు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. హైదరాబాద్‌లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికార దాహంతో కాంగ్రెస్, బీఆర్ఎస్( BRS) పార్టీలు ఫిరాయింపులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఓపెన్ ల్యాండ్ ఉంటే ఎలా దోచుకోవాలనే, రెండు పార్టీలు ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ (KCR) కుటుంబానికి ఎన్ని ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని ఇప్పుడు అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) 3 ఏళ్ల తర్వాత ఎందుకు అడుగుతున్నారు? కేసీఆర్ ఫామ్‌హౌస్‌లపై సమాచారం కోసం 3 ఏళ్లు పట్టిందా? రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు. చర్యలు మాత్రం శూన్యం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఏ విధంగా ఎంపీ టికెట్ ఇస్తారు? ఇలాంటి అనైతిక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలి అని అన్నారు.








