హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : ఏలేటి
హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టు (Supreme Court)కు వెళ్లకుండా రాజీనామా చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Eleti Maheshwar Reddy) డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టులో రేపు కేవియట్ పిటిషన్ వేస్తామని తెలిపారు. దానం నాగేందర్ (Danam Nagender) పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ (BJP) పోరాడుతుంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకునే వారికి కోర్టు తీర్పు చెంపపెట్టు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ 9Congress Party) బుద్ధి తెచ్చుకోవాలి. మిగిలిన వాళ్లతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి అని డిమాండ్ చేశారు.








