కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి పయ్యావుల భేటీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రపంచబ్యాంక్ (World Bank) ఆర్థికసాయంతో రాయలసీమ (Rayalaseema)ను ఉద్యానహబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బృహత్తర కార్యక్రమానికి కేంద్రం నుంచి సహకారం అందించాలని కోరారు. సాస్కీ నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు.








