తిరుమల లడ్డూ, కల్తీ నెయ్యి కేసు లో కీలక పరిణామం
తిరుమల లడ్డూ(Tirumala Laddu) కల్తీ నెయ్యి (Adulterated Ghee) కేసులో ఈడీ అధికారులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాశ్ చంద్ మంగ్లా (Kailash Chand Mangla)ను అరెస్టు చేసి విశాఖ పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్ విధించారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ (ED) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 2019-24 మధ్య టీటీడీ (TTD) కి సుమారు రూ.230 కోట్ల విలువైన కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు ఈడీ నిర్థరించింది. ఇందులో ఒక్క కైలాశ్ చంద్ మంగ్లానే దాదాపు రూ.96 కోట్లు విలువైన కల్తీ నెయ్యిని తయారు చేసినట్టు ఈడీ గుర్తించింది. పామాయిల్, పామ్కెర్నల్ ఆయిల్, రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేసినట్టు ఈడీ స్పష్టం చేసింది. కల్తీ తెలియకుండా కొనుగోళ్లు అమ్మకాలపై కైలాశ్ చంద్ నకిలీ రికార్డులు సృష్టించినట్టు దర్యాప్తులో తేలింది.








