హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా … సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచన లేదు
అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు (High Court) ఇచ్చిన తీరుపై దానం నాగేందర్ (Danam Nagender) స్పందించారు. న్యాయస్థానం తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. సుప్రీం కోర్టు (Supreme Court)కు వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. ప్రజా క్షేత్రంలో, ఎన్నికల్లో నే కొట్లాడుతాం. ఎన్నికల్లో పోరాడటం నాకు కొత్త కాదు. పోరాటాలు చేసే ఈ స్థాయికి వచ్చా. ఎన్నికలు (Elections) వస్తే, ప్రజా క్షేత్రంలో పోరాడుతా. విజయం సాధిస్తా అని తెలిపారు.








