అక్టోబర్ 1న కరవు మండలాల ప్రకటన : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) సమీక్ష చేపట్టారు. అక్టోబర్ (October) 1న కరువు మండలాల (Drought mandals) ప్రకటనపై అధికారులకు సీఎం సూచనలు చేశారు. శాస్త్రీయంగా కరవు మండలాలను గుర్తించాలని పేర్కొన్నారు. ఎక్కడా పంట నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వర్షాభావ పరిస్థితులపై కేంద్రానికి ప్రతి నెలా నివేదికలు పంపాలని ఆదేశించారు. రైతులను ఆదుకునేందుకు పంటల పరిస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సూచించారు. ఎల్నినో (El Nino) ప్రభావంతో ఉద్యాన పంటలకు ముప్పులేకుండా చూడాలని చంద్రబాబు కోరారు.








