అధికారం ఉందని విర్రవీగితే ఎదురుదెబ్బతు తప్పవు : కౌశిక్ రెడ్డి
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు (High Court) ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పిటిషనర్ కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) స్పందించారు. తెలంగాణ భవన్ ఆయన మీడియాతో మాట్లాడుతూ దానంపై అనర్హత వేటు బీఆర్ఎస్ (BRS) పార్టీకి లభించిన విజయమని పేర్కొన్నారు. అమ్ముడుపోతే అనర్హత వేటు తప్పదని మేం గతంలోనే చెప్పాం. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ. మిగిలిన 8 మందిపైనా అనర్హత వేటు పడేవరకు పోరాటం కొనసాగిస్తాం. ఖైరతాబాద్ (Khairatabad) ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తుంది. అధికారం ఉందని విర్రవీగితే ఎదురుదెబ్బతు తప్పవు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితి అని అన్నారు.








