ది ప్యారడైజ్ పై నాని భారీ నమ్మకం.. థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!
నేచురల్ స్టార్ నాని(nani) నటించిన అత్యంత భారీ సినిమాల్లో ఒకటిగా తెరకెక్కిన ది ప్యారడైజ్(the paradise) రిలీజ్ కు రెడీ అయింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri) నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానుండగా, సెప్టెంబర్ 23 నుంచే ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేయడంతో ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న రాఘవ్ జుయాల్(raghav juyal) ఆయా షేర్(aaya sher) సాంగ్ కు స్టేజ్‌పై చేసిన పెర్ఫార్మెన్స్ అభిమానులను ఉత్సాహపరిచింది.
సినిమాకు మ్యూజిక్ అందించిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్(Anirudh ravichander) ఫైనల్ మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉండటంతో వీడియో బైట్ ద్వారా ఈవెంట్లో భాగమయ్యారు. శ్రీకాంత్ ఓదెల(srikanth odela)తో తనకు మంచి స్నేహం ఏర్పడిందని, ఇద్దరి మధ్య క్రియేటివ్‌గా మంచి సింక్ కుదిరిందని తెలిపారు. సినిమా, నాని పెర్ఫార్మెన్స్ను తాను దగ్గరగా చూశానని, నాని తన పాత్రలో అద్భుతంగా నటించారని ప్రశంసించారు. మోహన్ బాబు(Mohan babu), రాఘవ్ జుయాల్ కూడా ఆకట్టుకున్నారని పేర్కొంటూ, త్వరలోనే థియేటర్లలో జడల్ జమానాతో భారీ సందడి మొదలవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఇక నాని మాట్లాడుతూ ది ప్యారడైజ్ లో భాగం కావడం తనకు ఎంతో స్పెషల్ అని తెలిపారు. శ్రీకాంత్ ఓదెలలోని ప్యాషన్‌ను తాను మొదటి నుంచే గమనించానని, అదే స్క్రీన్‌పై మాస్ ఎలిమెంట్స్‌తో బలంగా కనిపిస్తుందని అన్నారు. సమక్క సాంగ్ సినిమాకు ఉన్న ఎమోషనల్ డెప్త్ ను తెలియజేస్తుందని, అనిరుధ్ స్పెషల్ గా పాడిన ఈ సాంగ్ అందుకు నిదర్శనమని చెప్పారు. ఆడియన్స్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే సినిమానే అందిస్తానని నాని స్పష్టం చేస్తూ, నెగెటివిటీని పక్కనపెట్టి థియేటర్లలో ది ప్యారడైజ్ ను ఆస్వాదించాలని కోరారు.








