తెలుగులో సత్తా చాటేందుకు రెడీ అవుతున్న కార్తి
కోలీవుడ్ హీరో కార్తి(karthi) తెలుగులో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆయన.. ఇక వరుసగా స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. గతంలో నాగార్జున(nagarjuna)తో కలిసి ఊపిరిలో నటించిన కార్తి, అప్పటినుంచే తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. అయితే సరైన కథ, కాంబినేషన్ సెట్ అవకపోవడంతో ఆ ప్రయత్నం ఆలస్యమైంది. ఇప్పుడు మాత్రం వరుస ప్రాజెక్టులతో ఆ లోటును భర్తీ చేయబోతున్నారు.
కల్యాణ్ శంకర్(kalyan sankar) దర్శకత్వంలో కార్తి చేస్తున్న సినిమా ఇప్పటికే సెట్స్‌పై ఉంది. సంక్రాంతి 2027 బరిలో రిలీజ్ చేయాలని మొదట్లో భావించినప్పటికీ.. ప్రస్తుతం ఈ సినిమాను సమ్మర్ 2027కు వాయిదా వేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara entertainments) నిర్మిస్తున్న ఈ సినిమా కార్తి కెరీర్లో మరో కీలక తెలుగు ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఇదే సమయంలో హిట్(Hit) ఫ్రాంచైజ్‌తో కార్తి మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హిట్4(Hit4)గా రానున్న ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నారు. నాని(nani) నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా(Wallposter cinema) నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ 2027 సంక్రాంతి తర్వాత ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి
ఇలా 2027లో కార్తి నటించిన రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకే ఏడాదిలో రెండు తెలుగు ప్రాజెక్టులతో కనిపించనుండటం ఆయన టాలీవుడ్‌పై పెంచుకుంటున్న ఫోకస్‌కు సంకేతంగా మారింది. మరోవైపు మార్షల్(marshal) షూటింగ్‌లోనూ కార్తి బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు మోహన్ రాజాతో ఓ సినిమా కోసం కూడా డిస్కషన్స్ జరుగుతున్నట్లు సమాచారం. మొత్తంగా చూస్తే.. తమిళ హీరోగా కొనసాగుతూనే తెలుగు మార్కెట్లోనూ తన స్థానాన్ని మరింత బలపరుచుకునేలా కార్తి కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు.








