ఏపీలో వాయుగుండం కలకలం.. కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..!
ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర వాయుగుండం(Heavy Rains) ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు రక్షణ చర్యలను వేగవంతం చేసింది. రానున్న రెండు మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు, అత్యవసర సమాచారం పంచుకునేందుకు వీలుగా ప్రభుత్వం విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి హెల్ప్‌లైన్ నెంబర్లను(Help Line Numbers) ప్రకటించింది.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా అత్యవసర సహాయం కావాల్సిన వారు 112, 1070, విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 18004250101 లను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. దీనితో పాటు విద్యుత్ సేవలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు లేదా అత్యవసర పరిస్థితులు ఉంటే భక్తులు మరియు సామాన్య ప్రజలు వినియోగించుకోవడానికి వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ 1912 అందుబాటులో ఉంచారు.
అలాగే కార్పొరేట్ ఆఫీస్ నెంబర్ 8331018762 కు కూడా సంప్రదించవచ్చు. వర్ష తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల పరిధిలో స్థానిక యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉండేలా లోకల్ కంట్రోల్ రూమ్ నెంబర్లను కూడా అధికారికంగా విడుదల చేశారు. శ్రీకాకుళం ప్రాంత ప్రజల కోసం 9701400865, టెక్కలి పరిధిలో 9490610050, పలాస నియోజకవర్గానికి 08945241084, పాలకొండ పరిసర ప్రాంతాలకు 8332843546 నెంబర్లను కేటాయించారు. అలాగే పార్వతీపురం వాసులు 9398594750, విజయనగరం టౌన్ మరియు రూరల్ పరిధిలో ఉన్నవారు 9490610102, బొబ్బిలి ప్రజలు 9490610121 నెంబర్లలో అధికారులను సంప్రదించవచ్చు.
మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం, గోదావరి జిల్లాల పరిధిలోని వివిధ డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లను యాక్టివేట్ చేశారు. విశాఖ జోన్-1 పరిధిలోని ప్రజల కోసం 9490610019, విశాఖ జోన్-2 కు 9849628880, విశాఖ జోన్-3 పరిధిలో 9491030722 నెంబర్లు నిరంతరం పని చేస్తాయి. వీటితో పాటు అనకాపల్లి డివిజన్ పరిధికి 9490610023, కశింకోట ప్రాంతానికి 8333810597, నర్సీపట్నానికి 9491030723, పాడేరు ఏజెన్సీ పరిధిలోని ప్రజలకు 9490610027 నెంబర్లు అందుబాటులో ఉంచారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని కాకినాడ ప్రాంత ప్రజల కోసం 9490610856, పెద్దాపురం డివిజన్‌కు 9493178728, రాజమహేంద్రవరం టౌన్ కు 9490610855 మరియు రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతానికి 9490610859 నెంబర్లలో సహాయక బృందాలు అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఈ నెంబర్లను సంప్రదించి తగిన రక్షణ పొందాలని అధికారులు కోరారు.








