వరల్డ్స్కిల్స్ షాంఘై 2026.. పోటీలకు భారత్ తరఫున పిడిలైట్ శిక్షణ పొందిన యువకులు
ప్రముఖ నిర్మాణ రసాయనాలు , అడెసివ్స్ తయారీ సంస్థ ‘పిడిలైట్ ఇండస్ట్రీస్’ (Pidilite Industries) మరో మైలురాయిని సాధించింది. చైనాలోని షాంఘై వేదికగా జరగనున్న అంతర్జాతీయ ‘వరల్డ్స్కిల్స్ 2026’ పోటీల్లో భారత్ తరఫున పాల్గొనేందుకు పిడిలైట్ శిక్షణ పొందిన ఇద్దరు యువ ప్రతిభావంతులు అర్హత సాధించారు.
‘ఇండియాస్కిల్స్ 2026’ జాతీయ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రకాష్ సుతార్ , పంకజ్ జంగ్రా.. వరల్డ్స్కిల్స్ షాంఘై వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరు పిడిలైట్ వుడ్వర్కింగ్ అండ్ ప్లంబింగ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్కిల్స్ (PWP) కేంద్రంలో ప్రత్యేక శిక్షణ పొందడం విశేషం.
నైపుణ్యాభివృద్ధే దేశ భవిష్యత్తు..
ఈ విజయంపై పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుధాన్షు వత్స మాట్లాడుతూ.. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు మౌలిక వసతులతో పాటు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా యువతను తీర్చిదిద్దడంలో తమ పీడబ్ల్యూపీ (PWP) కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, గ్లోబల్ వేదికపై భారత్ కీర్తిని చాటనున్న ఈ యువ నిపుణులకు మద్దతు ఇవ్వడం గర్వకారణమని తెలిపారు.
సెప్టెంబర్ 22 నుంచి పోటీలు..
షాంఘై వేదికగా సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు ఈ ప్రతిష్టాత్మక 48వ వరల్డ్స్కిల్స్ పోటీలు కొనసాగుతాయి. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల నుంచి సుమారు 1,400 మంది యువ నిపుణులు 64 వివిధ నైపుణ్య విభాగాలలో ఈ పోటీల్లో తలపడనున్నారు. సంప్రదాయ నైపుణ్యాలకు ఆధునిక సాంకేతికతను జోడించి, అంతర్జాతీయ ప్రమానాలతో కూడిన శిక్షణను అందించడంలో పిడిలైట్ నిరంతరం కృషి చేస్తోంది.








