తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సతీమని నారా భువనేశ్వరి ( Nara Bhuvaneswari) దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా ఆలయంలోకి వెళ్లి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు ఆమెకు టీటీడీ ఈవో రవిచంద్ర (avichandra), అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkayya Chowdary) స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో నారా భువనేశ్వరికి పండితులు ఆశీర్వచనం చేయగా ఈవో, అదనపు ఈవోలు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.








