రాయల్ లుక్ లో మెరిసిసోతున్న మిల్కీ బ్యూటీ
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(tamanaah bhatia) తాజాగా షేర్ చేసిన ట్రెడిషనల్ అండ్ రాయల్ ఫోటోస్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బీహార్ సంస్కృతి, జానపద కథల నేపథ్యంలో తెరకెక్కుతున్న తన రాబోయే సినిమా ది వివాన్(the vivaan) సినిమాకు నివాళిగా ఈ స్పెషల్ ఫోటోషూట్‌ను తమన్నా ప్లాన్ చేసి ఎంతో ట్రెడిషనల్ గా కనిపించింది ఈ ఫోటోల్లో తమన్నా ఎల్లో అండ్ రాయల్ బ్లూ కలర్ హ్యాండ్ పెయింటెడ్ మధుబని ఓధ్నాను సెలెక్ట్ చేసుకుని అవుట్‌ఫిట్ కు తగ్గట్టు స్పెషల్ డైమండ్ చందేలియర్ ఇయర్ రింగ్స్ ధరించి రాయల్ లుక్ లో మెరవగా, ఆ ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.








