టీడీపీ కార్యాలయం దాడి కేసులో.. పోలీసులు కీలక నిర్ణయం
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసు ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిందితులపై రౌడీషీట్లు తెరవాలని విజయవాడ సీపీ రాజశేఖరబాబు (CP Rajasekhara Babu) ఆదేశాలు జారీ చేశారు. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయం ( TDP Central Office) పై దాడి జరిగింది. కమిషరేట్ పరిధిలోని 9 పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్వోలకు రౌడీషీట్లు తెరవాలంటూ సీపీ కార్యాలయం నుంచి మెమోలు జారీ అయ్యాయి. ఈ జాబితాలో వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం (Talasila Raghuram), ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ (Devineni Avinash) సహా మాజీ కార్పొరేటర్లు, బెయిల్ పై బయటకొచ్చిన సుమారు 20 మంది వరకు ఇతరులు ఉన్నారు.








