రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందా? : బండి సంజయ్
కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్(BRS) ను మించి నిర్బంధాలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా లేక పోలీసులతో రాజ్యం ఏలుతున్నారా? అని ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టును సందర్శించి రైతులను కలిసేందుకు వెళ్లాలనుకోవడంలో తప్పేముంది? పార్టీ అధ్యక్షుడు రామచందర్రావు (Ramachander Rao)ని అరెస్టు చేయడం, బీజేపీ నాయకులను నిర్బంధించడం దుర్మార్గం. తక్షణమే జూరాల ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) దుర్ఘటనపై విచారణ వ్యక్తం చేశారు.








