ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి వెళ్లి విచారణ చేసే హక్కు మీకెక్కడిది? : జగదీశ్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఎమర్జెన్సీ (Emergency) కంటే దారుణంగా ఉందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ప్రైవేటు ఆస్తుల దగ్గరకు కాకుండా, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే బాగుంటుందని సూచించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పర్యటనలను ఆ పార్టీ వాళ్లే వ్యతిరేకిస్తున్నారు. అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి వెళ్లి విచారణ చేసే హక్కు మీకెక్కడిది? ఐదు రోజుల తిరిగి మీరు సాధించింది ఏంటి? ఎండిపోయిన పంటలను ఎందుకు కాంగ్రెస్ వాళ్లు పరిశీలించడం లేదు. మంత్రి కోమటిరెడ్డి ( Minister Komatireddy) నాకు ఎయిర్‌పోర్టు (Airport) పక్కనే విలువైన భూములున్నాయని పదేపదే ఆరోపణలు చేశారు. అవి అవాస్తవమని తేలిపోయింది అని పేర్కొన్నారు.








