ఎస్ టి-సాట్ లో అశ్రిత్ అద్భుత ప్రతిభ….
హైస్కూలు స్థాయిలో విద్యార్థుల పరిజ్ఞానాన్ని అంచనా వేయడానికి, కళాశాల కోర్సుల్లో ప్రాధాన్యం కల్పించడానికి అమెరికాలో నిర్వహించే స్కూల్ అసెస్మెంట్ టెస్ట్ (ఎస్ టి-సాట్ )లో ప్రవాస తెలుగు కుటుంబానికి చెందిన బాలుడు అశ్రిత్ తాళ్లూరి అద్భుత ప్రతిభతో సత్తా చాటాడు. జార్జియా రాష్ట్రం ఫుల్టన్ కౌంటీకి చెందిన ఆశ్రిత్ తాళ్లూరి అనే 14ఏళ్ల బాలుడు చిన్న వయసులోనే స్కూల్ అసెస్మెంట్ టెస్ట్ అa అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఏకంగా 1600కి 1600 మార్కులు సాధించి అందరినీ అబ్బురపరిచాడు. ఫైనల్ ఎగ్జామ్‌కు ముందే ఆశ్రిత్ మూడు ప్రాక్టీస్ టెస్టుల్లోనూ 1600 మార్కులు సాధించాడు. జనవరిలో ఎగ్జామ్ రాసుకునేందుకు రిజిస్టర్ చేసుకున్న అతడు.. ఆ తర్వాత కొన్ని నెలలపాటు ప్రణాళికబద్ధంగా సిద్ధమయ్యాడు. ట్యూషన్ చెప్పించుకోవడం, యూట్యూబ్ వీడియోలను చూడటం వంటివి చేసేవాడు.
రైటింగ్, రీడింగ్ విభాగాల్లో ఒత్తిడిని జయిస్తూనే ఫైనల్ ఎగ్జామ్స్‌ను ప్రశాంతంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు ఫలితాలు వెలువడగా.. అతడు ఫుల్ స్కోర్ 1600 సాధించాడని తెలియడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆశ్రిత్ హైస్కూల్ పాఠశాలలో చదువుతున్నప్పుడే 14 హైస్కూల్ క్రెడిట్లు పూర్తి చేశాడు. హార్వర్డ్, రైస్ విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన కళాశాల స్థాయి వేసవి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు. ప్రస్తుతం ఇన్నోవేషన్ అకాడమీలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆశ్రిత్.. డ్యూయల్ ఎన్రోల్మెంట్ ద్వారా 2 కళాశాల స్థాయి కోర్సులను కూడా అభ్యసిస్తున్నాడు.
విరామ సమయంలో సాట్ ప్రాక్టీస్ పేపర్లు రూపొందిస్తూనే.. పరీక్షల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇతర విద్యార్థులకు సూచనలిస్తున్నాడు. చదువుతో పాటు చెస్, విమానయానంపై ఆసక్తి పెంచుకున్న అతడు.. మెట్రో అట్లాంటా ప్రాంతంలోని హ్యాకథాన్లలోనూ పాల్గొంటున్నాడు. అశ్రిత్ తల్లిదండ్రులు తరుణి, రామనరేష్లది గుంటూరు జిల్లా తెనాలి. వీరు 2008లో అమెరికా వెళ్లి జార్జియాలో స్థిరపడ్డారు. తొలి నుంచీ చదువుల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్న అశ్రిత్.. చెస్, తైక్వాండో ఆటల్లోనూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఛార్టర్డ్ విమానాలను నడపడంలో శిక్షణ పొందుతున్నాడు. ‘సాట్ శిక్షణలో భాగంగా అమ్మానాన్నలు, ఉపాధ్యాయుల సూచనలతో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. న్యూరోసర్జన్ కావాలన్న తన తాత తాళ్లూరి సుబ్బారావు కోరికను నెరవేరుస్తానని చెప్పాడు.








