తెలుగులో గ్యాప్.. ఇతర భాషల్లో జోరు!
అంజలి(Anjali) కెరీర్‌ను కేవలం అవకాశాలతో కొలవలేం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma vakitlo sirimialle chettu)తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో సీతమ్మగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, కమర్షియల్ కథల్లోనూ, యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రల్లోనూ తనదైన ముద్ర వేసింది. అయితే ఇటీవలి కాలంలో టాలీవుడ్లో అంజలి కనిపించే ప్రాజెక్టులు తగ్గిపోవడంతో ఆమె తెలుగు సినిమాలకు దూరమైందా అనే డిస్కషన్ మొదలైంది. ప్రస్తుతం చేతిలో చెప్పుకోదగ్గ తెలుగు ప్రాజెక్ట్ లేకపోవడం ఈ డిస్కషన్ కు మరింత ఆసక్తిని పెంచుతోంది.
అయితే మరోవైపు తమిళ, మలయాళ పరిశ్రమల్లో మాత్రం అంజలి కెరీర్ కంటిన్యూ అవుతూనే ఉంది. ముఖ్యంగా అక్కడి డైరెక్టర్లు ఆమెను కేవలం గ్లామర్ హీరోయిన్గా కాకుండా పాత్రకు బలం చేకూర్చే నటిగా చూస్తున్నారు. విభిన్నమైన కథలు, బలమైన క్యారెక్టర్లు, ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ అవకాశాలు అందుకుంటూ అంజలి తన పరిధిని విస్తరిస్తోంది. దీంతో అసలు సమస్య ఆమెకు అవకాశాలు లేకపోవడం కాదని, తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెకు సరిపోయే పాత్రలు ఎంతవరకు రెడీ అవుతున్నాయన్నదే ప్రశ్నగా మారింది.
గీతాంజలి(Geethanjali), మసాలా(masala), వకీల్ సాబ్(vakeel saab), గేమ్ ఛేంజర్(game changer) వంటి సినిమాల్లో అంజలి చూపించిన వైవిధ్యం చూస్తే ఆమెను ఒకే తరహా పాత్రలకు పరిమితం చేయడం కష్టం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంజలికి సరైన కథ, బలమైన పాత్ర దొరికితే టాలీవుడ్లో మరోసారి తన సత్తా చూపించే అవకాశం ఉంది. అందుకే ఇది ఆమెకు గుడ్‌బై దశ కంటే, సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న బ్రేక్ గా చూడొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.








