విక్రమ్ ప్రభు, సిద్ధార్థ్, రాహుల్ ‘సిటీ ఆఫ్ గోల్డ్’ ఫస్ట్ లుక్, మిస్టీరియస్ గ్లింప్స్
మోస్ట్ ట్యాలెంటెడ్ విక్రమ్ ప్రభు 26వ చిత్రం ‘సిటీ ఆఫ్ గోల్డ్’. ఈ చిత్రానికి సిద్ధార్థ్ దర్శకత్వం వహించారు. విక్రమ్ ప్రభు సరసన శివత్మిక రాజశేఖర్ కథానాయికగా నటిస్తుండగా, ఇంటర్నెట్ సంచలనం అమలా షాజీ ముఖ్య పాత్రలలో కనిపిస్తున్నారు. రోమియో పిక్చర్స్ బ్యానర్ పై రాహుల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యాయి. విడుదలైన కొద్దిసేపటికే మంచి స్పందన లభించింది.
ఫస్ట్ లుక్‌లో విక్రమ్ ప్రభు ఎంతో ఇంటెన్స్ లుక్‌తో కూర్చుని.. చాలా క్యాజువల్‌గా బంగారు కడ్డీలను పైకి విసురుతూ పట్టుకుంటూ కనిపించారు. బంగారం విలువతో పాటు దాని చుట్టూ ఉన్న మిస్టీరియస్ ప్రపంచాన్ని కలిపి చూపించిన ఈ విజువల్ ఆసక్తిని పెంచుతోంది.
గ్లింప్స్ ప్రేక్షకులను మరింత ఆసక్తికరమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. బంగారం మార్కెట్, అక్కడ పనిచేసే వ్యక్తులు, సామాన్య ప్రజలకు పెద్దగా తెలియని ఒక రహస్య వ్యవస్థను ఇందులో చూపించారు. ఆకట్టుకునే విజువల్స్ ద్వారా సినిమా నేపథ్యాన్ని, పాత్రలను పరిచయం చేయడం క్యురియాసిటీ పెంచింది.
విక్రమ్ ప్రభు ఇందులో ఇంటెన్స్ రోల్లో కనిపించనున్నారు. ఆయన కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అలగం పెరుమాళ్, జాఫర్ ఇడుక్కి, జీఎం సుందర్, వసుంధర, సునీల్ సుగత, జయకుమార్, మౌరిష్ దాస్, బాల హసన్, లిజ్జీ ఆంటోనీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సినిమాటోగ్రాఫర్ కార్తీక్ శరాజ్ ఈ డార్క్ అండ్ మిస్టీరియస్ ప్రపంచాన్ని అద్భుతమైన విజువల్స్‌తో ఆవిష్కరించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు మరింత డెప్త్‌ను తీసుకొచ్చింది. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మిస్టరీ, టెన్షన్‌ను మరింత పెంచుతూ.. విజువల్స్‌కు తగ్గ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. అరుల్ మోసెస్ ఎ ఎడిటర్‌గా పనిచేస్తుండగా.. హరి హరన్ పీఎస్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కావ్య వేలుసామి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లను దినేష్ కాసి కొరియోగ్రఫీ చేశారు.
కోయంబత్తూర్, చెన్నై, కేరళలో ఈ సినిమాను విస్తృతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
బంగారం వ్యాపారం వెనుక పనిచేసే వ్యక్తుల జీవితాలు, ఈ వ్యాపారానికి అవతలి వైపు చోటుచేసుకునే ఎవరికీ తెలియని సంఘటనలను ఈ సినిమా ప్రజెంట్ చేయనుంది. డిఫరెంట్ కాన్సెప్ట్, ఇంట్రెస్టింగ్ విజువల్స్, టాలెంటెడ్ కాస్ట్ అండ్ క్రూతో ‘సిటీ ఆఫ్ గోల్డ్’ విక్రమ్ ప్రభు కెరీర్లో మరో ఆసక్తికరమైన చిత్రంగా తెరకెక్కుతోంది.








