తెలుగు రిలీజ్‌కు డోరతీ రెడీ
కోలీవుడ్ లో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న డోరతీ(dorathi) ఇప్పుడు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్(karthik subbaraj) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజైన తర్వాత వచ్చిన రెస్పాన్స్ తో పాటు సినిమాలోని సెన్సిటివ్ అంశాలపై జరుగుతున్న డిస్కషన్ ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ఇళయరాజా(ilayaraja) అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
కీర్తి సురేష్(keerthy suresh), సనంత్(Sananth), రిషికాంత్(Rishikanth) కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికే పలు ప్రముఖ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకుంది. థియేట్రికల్ రన్లో కోలీవుడ్ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు వెర్షన్‌పై కూడా ఆసక్తి ఏర్పడింది. రానా దగ్గుబాటి(rana daggubati)కి చెందిన స్పిరిట్ మీడియా(spirit media) తెలుగు రాష్ట్రాల రిలీజ్ రైట్స్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు టాలీవుడ్లో సరైన రిలీజ్ ప్లాట్‌ఫామ్ దక్కినట్టైంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డోరతీ మూవీని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2, 2026న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ మేకింగ్, కీర్తి సురేష్ యాక్టింగ్, ఇళయరాజా మ్యూజిక్ కలగలిసిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను ఎంతవరకు ఆకట్టుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళంలో ఏర్పడిన డిస్కషన్ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి.








