ట్రైలర్ కు బాబాయ్.. ప్రీ రిలీజ్ కు అబ్బాయ్!
తెలుగు ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తున్న రాబోయే సినిమాల్లో ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) ప్రధాన పాత్రలో నటించిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్(Dont trouble the trouble) ఒకటి. శశాంక్ యేలేటి(Sasank yeleti) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థ్రిల్లర్ అంశాలకు విజువల్ ట్రీట్‌ను జోడిస్తూ తెరకెక్కినట్టు ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌ను చూస్తే అర్థమవుతుంది. ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీ వర్గాల్లోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
మరోవైపు సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ సందర్భంగా బాలకృష్ణ (Balakrishna)ను రంగంలోకి దించిన చిత్రబృందం.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR)ను తీసుకొస్తోంది. ఈ విషయాన్ని తాజాగా ఓ ఫన్ వీడియో ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో తారక్(Tarak) అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఈ ఈవెంట్‌పై ఆసక్తి పెరిగింది.
సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించనున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంతో పాటు ఎన్టీఆర్ హాజరుకానుండటంతో ఈ ఈవెంట్ కు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక దసరా సీజన్‌కు ముందు అక్టోబర్ 2న సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
https://x.com/arkamediaworks/status/2103785378444673348?s=20








