నిర్మాతపై డైరెక్టర్ ఎమోషనల్ కామెంట్స్
నాని(nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల(srikanth odela) దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్(the paradise) రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమాకు నిర్మాత సుధాకర్ చెరుకూరి(sudhakar cherukuri) పెట్టిన పెట్టుబడి, నాని మార్కెట్‌ను దాటి చేసిన ఖర్చు ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కథపై, డైరెక్టర్ విజన్‌పై నమ్మకంతో ఆయన ఖర్చు విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదనే టాక్ ఉంది.
సక్సెస్ సెలబ్రేషన్స్‌లో శ్రీకాంత్ ఓదెల చేసిన కామెంట్స్ ఈ జర్నీ వెనుక ఉన్న మరో కోణాన్ని బయటపెట్టాయి. కోవిడ్‌కు ముందే సుధాకర్ చెరుకూరి నిర్మాణ సంస్థలోకి అడుగుపెట్టానని, అప్పటి నుంచి దాదాపు ఆరేళ్లుగా తమ ప్రయాణం కొనసాగుతోందని శ్రీకాంత్ తెలిపారు. ఇంత లాంగ్ జర్నీలో తనను ఓపికగా భరించి, తనపై నమ్మకం ఉంచిన నిర్మాతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.
ఇక షూటింగ్ టైమ్ లో నాని, శ్రీకాంత్ ఓదెల మధ్య విభేదాలు వచ్చాయంటూ గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై డైరెక్టర్ కూడా క్లారిటీ ఇచ్చారు. షూటింగ్ టైమ్ లో ఇద్దరి మధ్య డిస్కషన్స్, వాదనలు జరగడం నిజమేనని ఆయన అంగీకరించారు. అయితే సినిమా కోసం జరిగిన క్రియేటివ్ డిస్కషన్స్గానే వాటిని చూడాలనే సంకేతం ఇచ్చారు. ఈ సందర్భంగా తనతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ శ్రీకాంత్ ఓదెల థ్యాంక్స్ చెప్పారు.








