మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
భారత దేశం గర్వించదగ్గ జాతిరత్నం మన్మోహన్ సింగ్ గారు
వారి స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం
రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, ఆర్ధిక మంత్రిగా, ప్రధానిగా పదవులకు ఆయన వన్నె తెచ్చారు
1991 లో పీవీ హయాంలో ఆర్ధిక మంత్రిగా దేశాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి కోలుకునేలా చేశారు
లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్
దేశ ఆర్ధిక వ్యవస్థలో కీలకమైన సంస్థలు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి సేవలు అందిస్తున్నాయి
అలాంటి ఈ ప్రాంతంలో మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సముచితం అని భావించాం
హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో కలిపి స్వాతంత్య్రం అందించిన ఘనత తొలి ప్రధాని నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ది
దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన ఘనత సోనియా గాంధీ, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ది
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తూ ఆయన చేసిన సంతకాన్ని ఇక్కడ పొందుపరిచాం
వారు ఎన్నో సరళీకృత విధానాలు తీసుకొచ్చారు
విద్యా హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ చట్టం, భూసేకరణ, పునరావాస చట్టం 2013 తీసుకొచ్చిన ఘనత సోనియా, మన్మోహన్ సింగ్ ది
భూమిలేని పేదలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని పునరావాస చట్టం ద్వారా హక్కు కల్పించారు
మౌనమునిలా దేశ ఆర్ధిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్
ఆయన జ్ఞాపకం ఢిల్లీలో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దురదృష్టం
కొన్ని సమయాల్లో రాజకీయాలకి అతీతంగా నిర్ణయం తీసుకోవాలి
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నాం
ఆయన పేరుతో ఢిల్లీలో ఒక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం
ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా లోక్ సభలో ప్రస్తావించాలని మా ఎంపీలకు సూచిస్తున్నా
మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ముఖ్యమంత్రిగా నాకు గర్వకారణం.
హాజరైన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, మాజీ ఆర్ధిక సలహాదారు మోహన్ గురుస్వామి, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఉన్నతాధికారులు.








