హైదరాబాద్ లో ఘనంగా ముగిసిన గణనాథుల నిమజ్జన ప్రక్రియ
హైదరాబాద్ నగరంలో సామూహిక వినాయక నిమజ్జన (Vinayaka Immersion) ప్రక్రియ ముగిసింది. నిమజ్జనాలు ప్రశాంతంగా జరగడంతో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ (Telangana Talli Flyover) కింద పోలీసులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి సీపీ సజ్జనార్ (CP Sajjanar) డ్యాన్స్ చేశారు. నిమజ్జన ప్రక్రియ ముగియడంతో సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేశారు. ట్యాంక్‌బండ్ (Tank Bund), లిబర్టీ, అసెంబ్లీ (Assembly) వైపు రాకపోకలను పునరుద్ధరించారు.








