ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం : కవిత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వమేనని, చేతలు శూన్యమని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత (Kavitha) విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ (KTR) ఫామ్‌హౌస్ పేరిట డ్రామాలు అడుతున్నారని మండిపడ్డారు. అంతా లోపాయికారీ ఒప్పందాలేనని, ఫామ్‌హౌస్ (Farmhouse)లపై చర్యలు ఉండవని ఎద్దేవా చేశారు. వచ్చే ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో (Khairatabad by elections) తెలంగాణ రక్షణ సేన పోటీ చేస్తుందని కవిత ప్రకటించారు.








