ఆస్ట్రేలియా పర్యటనలో బీజేపీ నేతలతో మాజీ మంత్రి మల్లారెడ్డి
ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Chamakura Malla Reddy) బీజేపీ నేతలతో కలిసి ఉన్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కొంతకాలంగా పార్టీ మారతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు (N. Ramchander Rao), ఆ పార్టీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (Rakesh Reddy)లతో కలిసి విదేశాల్లో కనిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రామచందర్ రావు, రాకేశ్ రెడ్డి, మల్లా రెడ్డి టూవుంబా మేయర్ జియోఫ్ మెక్ డొనాల్డ్ (Geoff McDonald)తో భేటీ అయ్యారు. టూవుంబా నగరాభివృద్ధి, ఈ ప్రాంతంలో పెరుగుతున్న భారతీయ సమాజం, వారి సహకారంపై అభిప్రాయాలను పంచుకున్నారు.








