భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. ముంపు ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస చర్యలను అధికారులు చంద్రబాబుకు వివరించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల (Fishermen) కుటుంబాలను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు 50 కిలోల బియ్యం (Rice) ఇవ్వాలని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50 నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు వివరించారు.








