చిరూ మాట వెనుక ఇంత అర్థముందా?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఏ సినిమా ఫంక్షన్ కు వెళ్లినా అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. తాజాగా సందీప్ కిషన్(Sundeep Kishan) హీరోగా నటించిన సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్(Sigma pre release event)లోనూ అదే జరిగింది. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా(Faria Abhullah)తో చిరంజీవి చేసిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గతంలో విశ్వంభర(Vishwambhara)లో తనతో కలిసి నటించే అవకాశం ఫరియాకు వచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న చిరు.. నాకు నువ్వు నో చెప్పావా ఫరియా.. లేదంటే నన్ను తొక్కేయాలని చూశావా అంటూ నవ్వులు పూయించారు.
చిరంజీవి మాటలు పూర్తిగా సరదా సందర్భంలో వచ్చినవే అయినా.. తొక్కేయడం అనే పదం మాత్రం నెటిజన్ల దృష్టిని స్పెషల్ గా ఎట్రాక్ట్ చేసింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చిరంజీవి కెరీర్‌కు సంబంధించి పలువురు హీరోల ఎదుగుదల, అవకాశాలపై రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా కొందరిని చిరు అడ్డుకున్నారనే వాదనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వీటిపై చిరంజీవి సాధారణంగా స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్ ను కొందరు ఫ్యాన్స్ ఆ డిస్కషన్స్ కు సరదా సమాధానంగా భావిస్తున్నారు.
ఫరియాతో చిరంజీవికి ఉన్న ఫన్ బాండింగ్ ఇదే మొదటిసారి కాదు. గతంలో ఓ కార్యక్రమంలో ఆమెతో కలిసి చిరు(Chiru) స్టెప్పులు వేసిన వీడియో వైరల్ అయింది. అప్పుడు కూడా తనను ఫరియా డ్యాన్స్ చేయించేలా చేసిందంటూ చిరంజీవి నవ్వుతూ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే జోడీ మధ్య సరదా సంభాషణ జరగడంతో ఆ పాత వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సిగ్మా(Sigma) ఈవెంట్ లో సినిమా కంటే చిరు-ఫరియా మధ్య జరిగిన ఈ కామెడీ ఎపిసోడ్‌పైనే ఎక్కువ డిస్కషన్ జరుగుతోంది.








