వీలైనంత త్వరగా ప్యాలెస్‌ను వినియోగానికి తెస్తాం : మంత్రి కందుల దుర్గేశ్
వ్యక్తిగత వినియోగం కోసం అత్యంత విలాసవంతంగా గత పాలకులు రుషికొండ ప్యాలెస్ (Rushikonda Palace)ను నిర్మించారని మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) అన్నారు. రాజమహేంద్రవరంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ హోటల్ రూమ్‌ల (Hotel rooms) వినియోగానికి అనుగుణంగా ఈ ప్యాలెస్ లేదని తెలిపారు. దీంతో పెద్ద సంస్థలు నిర్వహణకు ముందుకు రావడం లేదన్నారు. గత పాలకులు ఇష్టానుసారంగా రుషికొండ ప్యాలెస్‌ను నిర్మించారు. గత ప్రభుత్వం చేసిన కొన్ని పాపాలు కడిగేందుకు జీవితాలే సరిపోవు. రుషికొండ ప్యాలెస్‌ను ఆతిథ్య రంగానికే అప్పగిస్తాం. వీలైనంత త్వరగా ప్యాలెస్‌ను వినియోగానికి తెస్తాం అని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల (Local elections)పై దృష్టి పెట్టామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ ముందుకువెళ్తామన్నారు.








