హోంగార్డులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోలీస్ స్టయిఫండరీ కానిస్టేబుల్ ( డ్రైవర్) ఉద్యోగాలకు 10 శాతం రిజర్వేషన్ హోంగార్డుల (Home Guards)కు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తరులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ కేటగిరీలో డ్రైవర్(Driver) కానిస్టేబుల్ ( Constable)ఉద్యోగాలకు హోంగార్డులకు ఉన్న రిజర్వేషన్ సవరిస్తూ హోంశాఖ(Home Department) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇతర ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని అందులో పేర్కొంది. దీనివల్ల ఇప్పుడు జరిగే రిక్రూట్మెంట్లో హోంగార్డులకు ప్రయోజనం చేకూరనుంది. కానిస్టేబుల్ స్టయిఫండరీ ట్రైనీ ( డ్రైవర్) ఉద్యోగ నియామకాల్లో అవకాశాలను దక్కించుకునేందుకు ఉపయోగపడనుంది.








