ప్రవాసాంధ్రుల సమస్యలపై సీఎం చంద్రబాబుతో చర్చించా : ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ గురు రాజా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)ను గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ పి. గురు రాజా (Guru Raja) మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు (ఎన్ఆర్ఐ)లు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం తదితర అంశాలపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ (NRI)లతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడేందుకు కనీసం ప్రతి మÖడు నెలలకు ఒకసారి జూమ్ సమావేశం(Zoom meeting) నిర్వహించాలని రాజా విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించి, సమావేశానికి సంబంధించిన షెడ్యూల్ను సిద్ధం చేయాలని సూచించారు. ఇదే జోష్తో ముందుకు సాగాలని, పూర్తి సాకారం అందిస్తామని సీఎం చెప్పినట్లు రాజా తెలిపారు. ముఖ్యమంత్రి అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం మరింత బాధ్యతతో పనిచేసేందుకు తనకు స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీని మరింత బలోపేతం చేస్తూ, ప్రవాసాంధ్రుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.








