ఎడారి ఒడిలో లీలమ్మ ట్రెడిషనల్ లుక్..
శ్రీలీల(Sree Leela). తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తక్కువ టైమ్ లోనే విపరీతమైన స్టార్డమ్ ను అందుకున్న శ్రీలీల ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా అమ్మడు పీచ్ కలర్ లెహంగా, దానికి మ్యాచింగ్ ఎంబ్రాయిడరీ శారీ, తలపై అందంగా దుపట్టా వేసుకుని ఎంతో ఎట్రాక్టివ్ గా కనిపించింది. అవుట్‌ఫిట్ కు తగ్గట్టు నగలు, ఎడారి నేపథ్యానికి తగ్గట్టుగా ఇచ్చిన పోజులు ఆ లుక్ ను మరింత స్పెషల్ గా మార్చాయి.








