విశాఖలో ప్రి ఫ్యాబ్ నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
ఈప్యాక్ గ్రూప్ చైర్మన్ భజరంగ్ బోత్రాతో మంత్రి లోకేష్ భేటీ
అహ్మదాబాద్ (గుజరాత్): బులియన్ ట్రేడింగ్, ప్రీసియస్ మెటల్స్, కమాడిటీస్, డ్యూరబుల్స్ తయారీలో పేరెన్నికగన్న ఈ ప్యాక్ గ్రూప్ (Epack Group) చైర్మన్ భజరంగ్ బోత్రాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… డేటా సెంటర్ హబ్ గా మారుతున్న విశాఖపట్నంలో డేటా సెంటర్ల కోసం ఒక ప్రీ ఫ్యాబ్ నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఈప్యాక్ చైర్మన్ భజరంగ్ బోత్రా మాట్లాడుతూ… ప్రస్తుతం తమ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఈప్యాక్ డ్యూరబుల్స్ ఆధ్వర్యాన శ్రీసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో తయారీ యూనిట్ తోపాటు, శ్రీసిటీ సమీపంలోని మాంబట్టు వద్ద ప్రిఫ్యాబ్ పీఈబీ, ఇన్సులేటెడ్ శాండ్విచ్-ప్యానెల్ తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది, మాంబట్టు ఫేజ్ II కేంద్రం ఏప్రిల్ 2026లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని భజరంగ్ బోత్రా తెలిపారు.








