విశాఖ గ్రూప్ ఎండి జిగీష్ భాష్ దోషితో మంత్రి నారా లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ నెలకొల్పండి : మంత్రి లోకేష్
అహ్మదాబాద్ (గుజరాత్): ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్, ప్లాస్టిక్స్, సోలార్ కాంపొనెంట్స్, పైప్స్ & మెటీరియల్ హ్యాండ్లింగ్ లో ప్రఖ్యాతి గాంచిన విశాఖ గ్రూప్ ఎండి జిగీష్ భాష్ దోషితో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ లో సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పటికే రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీ వంటి సంస్థలు ఏపీకి వచ్చాయని తెలిపారు. ఎయిర్ పోర్టు, సీ పోర్టులకు సమీపంలో ఉన్న నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లిలో ఏదో ఒకచోట ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. జిగీష్ దోషి మాట్లాడుతూ… తమ సంస్థకు గాంధీనగర్ (గుజరాత్), బర్ధమాన్ (పశ్చిమ బెంగాల్)లో ప్యాకేజింగ్, ముంద్రా (గుజరాత్)లో 660 TPD సామర్థ్యం కలిగిన సోలార్ గ్లాస్ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. కొత్తగా డౌ, ధర్మేష్ ఫుడ్స్‌తో కలసి రీసైక్లబుల్ ప్యాకేజింగ్, W&H (జర్మనీ)తో కలసి ఫిల్మ్ లైన్ల ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.








