ఎక్కువ శ్రద్ధ లేదా నీరు పెట్టాల్సిన పని లేకుండా, ఎల్లప్పుడూ ఇల్లును కళకళలాడించే అద్భుతమైన 9 మొక్కలను చూద్దాం!
వారానికోసారి నీరు పోస్తే చాలు, ఎలాంటి ఎండ లేకపోయినా ఇండోర్‌లో ఏపుగా పెరిగి గాలిని శుద్ధి చేసే అత్యుత్తమ మొక్క ఇది.
స్నేక్ ప్లాంట్
బాటిల్స్ లేదా చిన్న కుండీలలో నీటిలోనూ, మట్టిలోనూ కూడా సులభంగా బతికి ఇంటికి అందమైన పచ్చటి రూపాన్ని ఇస్తుంది.
మనీ ప్లాంట్
చీకటిగా ఉండే గదుల్లోనూ, తక్కువ వెలుతురులోనూ అద్భుతంగా బతికే ఈ మొక్క ఆకులు ఎప్పుడూ పచ్చగా మెరుస్తూ ఉంటాయి.
జిజి ప్లాంట్
ఎక్కువ ఎండ తగిలే బాల్కనీలలో పెంచడానికి అనువైన ఈ మొక్కకు అసలు నీటి అవసరమే చాలా తక్కువగా ఉంటుంది.
కలబంద
పెద్దగా మెరిసే ఆకులతో ఉండే ఈ మొక్క ఇల్లు లోపల అలంకరణకు చాలా రిచ్ లుక్‌ను ఇవ్వడంతో పాటు తక్కువ కేర్‌తో పెరుగుతుంది.
రబ్బర్ ప్లాంట్
తీగలా అల్లుకునే ఈ అందమైన ఆకుల మొక్కను పెంచడం చాలా సులభం, దీనికి పెద్దగా ఎండ కూడా అవసరం ఉండదు.
ఫిలోడెండ్రాన్
ఇంటి హాలులో లేదా లివింగ్ రూమ్‌లో ఉంచడానికి అనువైన ఈ మొక్క చూడటానికి పెద్దదిగా ఉండి తక్కువ శ్రద్ధతో పెరుగుతుంది.
అరకా పామ్
చిన్న గాజు పాత్రలో నీరు పోసి ఉంచితే చాలు, ఎలాంటి ఎరువులు లేకుండా హాయిగా బతికి ఇంటికి అందాన్ని తెస్తుంది.
లక్కీ బాంబూ
బిజీ లైఫ్‌స్టైల్ ఉండే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటికి ప్రకృతి అందాన్ని తెచ్చిపెట్టే పర్ఫెక్ట్ మొక్కలు ఇవే!
సులభమైన పచ్చదనం