నక్కపల్లిలో బయోసిమిలర్ ప్లాంట్ ఏర్పాటు చేయండి :మంత్రి లోకేష్
ఎంక్యూర్ గ్లోబల్ ప్రెసిడెంట్ దీపక్ గోండాలియాతో మంత్రి లోకేష్ భేటీ
అహ్మదాబాద్ (గుజరాత్): ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ (EMCURE PHARMACEUTICALS) గ్లోబల్ ప్రెసిడెంట్ (టెక్నికల్ ఆపరేషన్స్) దీపక్ గోండాలియాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… బయోసిమిలర్ రంగంలో బలమైన ట్రాక్ రికార్డ్ కలిగిన ఎంక్యూర్ నక్కపల్లి క్లస్టర్ లో బయోసిమిలర్ ప్లాంట్‌కు ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్‌లో ఏపీఐ, ఫెర్మెంటేషన్ ఆధారిత బల్క్-డ్రగ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషించాలని కోరారు. ఇది మహారాష్ట్రలో బయోలాజిక్స్ కోసం ఎంక్యూర్ ఇప్పటికే నడుపుతున్న మైక్రోబియల్ (ఫెర్మెంటేషన్) ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేయడమేగాక, ఒక ప్రత్యేకమైన బల్క్-డ్రగ్ కేంద్రాన్ని అందిస్తుందని తెలిపారు. ఎంక్యూర్ ప్రెసిడెంట్ దీపక్ గోండాలియా స్పందిస్తూ… దేశంలో తమ సంస్థ హెచ్ఐవి యాంటీ వైరల్స్ తయారీలో మొదటి స్థానం, ఉమెన్ హెల్త్ కేర్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాము కాంప్లెక్స్ ఇంజెక్టబుల్స్, బయోసిమిలర్స్ పై దృష్టిసారించామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.








