పెళ్లి కాని బ్రాహ్మణ యువకులకు గుడ్ న్యూస్… ‘ప్రవర’లో రిజిస్టర్ చేసుకున్నారా?
అమెరికాలోని తెలుగు సంఘాలలో ఒకటైన ‘ప్రవరా వేదిక’ (కళ్యాణ వేదిక) ఆధ్వర్యంలో సరికొత్త వేడుక నిర్వహించనున్నారు. కాలిఫోర్నియా వేదికగా సెప్టెంబర్ 26, 2026 నాడు ‘మిక్స్ అండ్ మింగిల్’ (Mix and Mingle) పేరుతో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఒకే ఆలోచన విధానం ఉన్న వ్యక్తులు కలుసుకునేందుకు, భావి జీవిత భాగస్వామిని ఎరుక చేసుకునేందుకు (Future Spouses Intro and Connect) ఈ వేదిక చక్కటి అవకాశం కల్పిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు యువతీ యువకులు ఒకరినొకరు కలుసుకునేందుకు “Creating Connections Coast to Coast and Beyond” నినాదంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ఈవెంట్లో పాల్గొనాలనుకునే ఆసక్తి గల వారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ (https://forms.gle/cDkB3o3RJB37Eegh9) ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. డొనేషన్లు , చెల్లింపుల కోసం zelle ద్వారా [email protected] కి పంపవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. కాలిఫోర్నియా బే ఏరియాలో జీవిత భాగస్వామిని వెతుక్కుంటున్న వారికి ఇది మంచి వేదిక కానుంది.








