అపోల్ హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా ఉపాసన
అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals) ప్రాజెక్ట్ విభాగానికి నటుడు రాంచరణ్ (Ram Charan) భార్య ఉపాసన కామినేని కొణిదెల (Upasana Kamineni Konidela) డైరెక్టర్ (Director)గా నియమితులయ్యారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సీఎస్ఆర్ విభాగానికి ఆమె వైస్ చైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్ హోదాలో దేశవ్యాప్తంగా ఆసుపత్రి ప్రాజెక్టుల అభివృద్ధిని ఆమె పర్యవేక్షించనున్నారు. విస్తరణ ప్రణాళికలో భాగంగా రూ.8600 కోట్లు పెట్టుబడికి ఆపోలో హాస్పిటల్స్ సన్నద్ధమవుతునన వేళ ఈ నియామకం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందరికీ ప్రపంచస్థాయి వైద్య సేవలందించాలన్న లక్ష్యంతో ఆపోలో హాస్పిటల్స్‌ను తమ తాతగారైన డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి ( Prathap C. Reddy) ఏర్పాటు చేశారని ఉపాసన పేర్కొన్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్లడం తనపై ఉన్న బాధ్యత అని తెలిపారు.








